అమరావతి ఐకానిక్ టవర్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన: మొదటి డయాగ్రిడ్ పూర్తి
రిపోర్టర్: కిరణ్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
అమరావతిలోని ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి పొంగూరు నారాయణ స్పష్టతనిచ్చారు. గత నెలలో కురిసిన వర్షాల కారణంగా పనులకు కొంతమేర అంతరాయం ఏర్పడిందని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఐకానిక్ టవర్ల మొదటి డయాగ్రిడ్ నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఆరు చొప్పున ఫ్లోర్లు పూర్తి చేయాలని భావిస్తున్నామని, అసెంబ్లీ అలాగే హైకోర్టు భవనాల పునాది పనులు కూడా దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయని ఆయన వివరించారు.