జానపద బాణీలతో పల్లె గుండెను తట్టిలేపుతున్న నీల మహేష్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం గ్రామానికి చెందిన నీల మహేష్ జానపద గేయ రచయితగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యవసాయం చేస్తూ, మిషన్ భగీరథ ఆపరేటర్గా విధి నిర్వహణలో బిజిగా ఉన్నప్పటికీ కళపై మమకారంతో ఎన్నో వైవిధ్యమైన పాటలు రాశారు. రైతన్నల ఆవేదన, గ్రామీణ సంస్కృతి, భక్తి హాగూ బతుకమ్మ విశిష్టతను అక్షరబద్ధం చేస్తూ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.