అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్
రిపోర్టర్: విజయ్
స్థలం: Melbourne
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు విక్టోరియా తరఫున దేశీయ రెడ్ బాల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆస్ట్రేలియా సీనియర్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ వెల్లడించారు. తాను ఇకపై ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కెరీర్ లోని చివరి దశలో కొన్ని టోర్నీలపై శ్రద్ధ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాక్స్ వెల్ పేర్కొన్నారు.