హిందూ ధర్మానికి తాను వ్యతిరేకం కాదంటూ నటి రేణూ దేశాయ్ స్పష్టీకరణ

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

గణపతి నిమజ్జన వేడుకల్లో డీజేల హోరు, మద్యం సేవించి రోడ్లపై హంగామా చేయడంపై తాను చేసిన వ్యాఖ్యలపై నటి రేణూ దేశాయ్ మరోసారి స్పందించారు. తాను హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదని, పండుగ పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించే న్యూసెన్స్ను మాత్రమే ప్రశ్నించానని ఆమె తెలిపారు. పాత సంప్రదాయాలను విడిచిపెట్టి ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, రోడ్లపై అర్ధరాత్రి వేళల్లో చేసే శబ్దాల వల్ల వృద్ధులు, పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.