అసెంబ్లీలో కుప్పకూలిన సచివాలయ ఉద్యోగి రాజు మృతి

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ ఉద్యోగి రాజు ఆకస్మికంగా కుప్పకూలారు. ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ పీఎస్‌గా పనిచేస్తున్న ఆయనకు మంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పల్స్ పడిపోవడంతో రాజు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉద్యోగి అకాల మరణంపై తోటి సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.