పులివెందులలో ఓటు వేయబోనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: పులివెందుల
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్ లో తాను ఓటు వేయబోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని, అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ తీరుపై నిరసన తెలిపేందుకే ఓటింగ్ కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. పారదర్శకంగా రీపోలింగ్ నిర్వహిస్తేనే వచ్చి ఓటు వేస్తానని స్పష్టం చేశారు.