ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు: జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాకు దేశవ్యాప్తంగా నిరసనలు
రిపోర్టర్: విజయ్
స్థలం: ఢిల్లీ
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తీరును నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబైలో యువత ఉద్యమాలకు శ్రీకారం చుట్టిందని ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును కాపాడుకునేందుకు జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి, ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.