జన నాయగన్ లీక్ కేసులో ఉమ శంకర్ రౌడీషీట్ రద్దు

రిపోర్టర్: సతీష్ స్థలం: చెన్నై

తమిళనాడులో హీరో విజయ్ నటించిన జన నాయగన్ సినిమా ఆన్‌లైన్ లీక్ వివాదానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టయిన ఉమ శంకర్ పై చెన్నై పోలీసులు జారీ చేసిన రౌడీ చట్టం లేదా గూండా యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. ఉమ శంకర్ సోదరి రేణుకా దేవి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎన్ సతీ కుమార్, జస్టిస్ కె రాజశేఖర్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.