భక్తిపారవశ్యంతో పులకించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రావణ మాసం అమావాస్యను పురస్కరించుకుని సహస్ర లింగార్చన, రుద్రాభిషేకం వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు పెద్ది సుధాకర్ శర్మ, పెద్ది సతీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ల మురళితో పాటు పలువురు ధర్మకర్తలు, ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు.