తుఫాన్ ముప్పుపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రాబోయే తుఫాన్ నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆమె స్పష్టం చేశారు.