ఈవీఎంల మోసాలపై రాహుల్ గాంధీ తీరును ఎండగట్టిన కేంద్ర మంత్రి అమిత్ షా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్ లో గెలిస్తే ప్రజలు గెలిపించారంటారని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలు ఓడించాయంటూ నిందలు వేస్తారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యారని, పలు రాష్ట్రాల్ లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీని ఆయన సూటిగా నిలదీశారు. ఈ మేరకు హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.