టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: వివో ఆరిజిన్ ఓఎస్ 7 అప్డేట్ వివరాలు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

భారతీయ మార్కెట్లో వివో సంస్థ కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ఫోన్లతో పాటు ఆరిజిన్ ఓఎస్ 7 అప్డేట్ షెడ్యూల్ను ప్రకటించిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ దశలవారీగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈనెల చివరి నుండి వివో ఎక్స్ సిరీస్ ఫోన్లకు ఈ అప్డేట్ లభిస్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మిగతా సిరీస్ ఫోన్లకూ ఈ నూతన ఫీచర్లు అందుతాయని పేర్కొన్నారు.