దేశవ్యాప్తంగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిసెంబర్ 2026 నుండి మార్చి 2027 వరకు నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తాత్కాలిక క్యెండర్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్, జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్, జేఈఈ మెయిన్ 2027 సెషన్ వన్, నిఫ్ట్, సీయూఈటీ పీజీ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ విద్యా ప్రణాళికను ముందుగా సిద్ధం చేసుకోవడానికి ఈ షెడ్యూల్ దోహదపడుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది.