విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టును ప్రారంభించిన న్యాయమూర్తి
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ప్రారంభమైంది. అమరావతి నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ దీన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వీఎంఆర్డీఏ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ కోర్టు ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జడ్జి జి.శ్రీనివాస్, ఎన్ఐఏ తొలి న్యాయమూర్తి డి.శేషయ్యతో పాటు విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.