రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: కాల్పుల విరమణకు జెలెన్స్కీ సన్నద్ధం
రిపోర్టర్: రాము
స్థలం: World
అమెరికా రాయబారుల పర్యటన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతి చర్చల కోసం రష్యాతో తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించారు. అమెరికా రాయబారుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని, రష్యా కోసం కాదని స్పష్టం చేశారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు వాస్తవిక మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. చర్చలు సజావుగా సాగేందుకు ఇరు దేశాలు వైమానిక దాడులను నిలిపివేయాలని ఉక్రెయిన్ కోరుతోంది.