వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్: నీట్ ఎస్ఎస్ ప్రత్యేక సీట్ల కేటాయింపు విడుదల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
నీట్ ఎస్ఎస్ ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో జాబితాను అందుబాటులో ఉంచామని, డీఎం, ఎంసీహెచ్ కోర్సుల అభ్యర్థులు తమ ఫలితాలను పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు. రోల్ నంబర్, ర్యాంక్, కేటాయించిన కళాశాల వివరాలను చెక్ చేసుకోవాలని సూచించారు.