రోహిత్ కోహ్లీ లేకపోయినా భారత జట్టుకు సమస్య లేదు అంటున్న సందీప్ పాటిల్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: భారతదేశం
భారత మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ ఆడాకపోయినా టీమిండియాకు ఎలాంటి సమస్య ఉండదని మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డేలపైనే దృష్టి పెట్టారని, వారి ఫిట్ నెస్ ఆధారంగానే భవిష్యత్ ఉంటుందన్నారు. అయితే మన జట్టు బెంచ్ బలం అద్భుతంగా ఉందని, వారి స్థానాలను భర్తీ చేసే సత్తా ఉన్న యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.