ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏపీపీఎస్సీతో పాటు వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల ఉద్యోగాలకు నాన్-యూనిఫాం పోస్టుల గరిష్ట వయోపరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచింది. అలాగే యూనిఫాం పోస్టులకు అదనంగా మరో 2 ఏళ్ల వయోసడలింపు కల్పించింది. ఈ నిబంధన 2027 సెప్టెంబర్ వరకు వచ్చే అన్ని నోటిఫికేషన్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.