కూన రవికుమార్ సమక్షంలో టీడీపీలో చేరిన ముప్పై కుటుంబాలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: బూర్జ
ఆముదాలవలస నియోజకవర్గంలో కూన రవికుమార్ నాయకత్వానికి ఆకర్షితులై ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. బూర్జ మండలం గంగంపేటకు చెందిన మత్స్యకార, ఇతర సామాజిక వర్గాల ప్రజలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని నాయకులు తెలిపారు.