కోనసీమలో ఇంటింటి ప్రచారం: ప్రజలను కలిసిన అమలాపురం ఎంపీ గంటి హరీష్

రిపోర్టర్: వెంకట్ స్థలం: కోనసీమ

కోనసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు అమలాపురం ఎంపీ, టీడీపీ విప్ గంటి హరీష్ మాధుర్ (బాలయోగి) వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నామని, ప్రభుత్వ పరంగా అందిస్తున్న సహాయ సహకారాలను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేపట్టామని ఆయన పేర్కొన్నారు.