ఫేక్ ఇన్వెస్ట్మెంట్ మోసాలపై సైబరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక: 1930కు ఫిర్యాదు చేయండి

రిపోర్టర్: సతీష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

త్వరిత లాభాల ఆశ చూపి మోసం చేసే నకిలీ ఇన్వెస్ట్మెంట్ యాప్లు, వెబ్సైట్లతో అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. సైబర్ మోసానికి గురైతే బాధితులు వెంటనే 1930 నంబర్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.