బిగ్బాస్ విన్నర్ ముత్తుకుమరన్పై మోసం ఆరోపణలు: ఆత్మహత్యకు యత్నించిన యువతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ప్యారిస్
బిగ్బాస్ షో సీజన్ ఎనిమిది విన్నర్ ముత్తుకుమరన్ తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పేరు తెచ్చుకున్న వహిదా అక్తర్ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి ఓ వీడియోను విడుదల చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె అందులో వాపోయింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రముఖ గేయరచయిత తామరై సోషల్ మీడియా వేదికగా ఆయనను నిలదీశారు.