ఆసియా క్రీడలకు భారత షూటింగ్ జట్టు ప్రకటన

రిపోర్టర్: గోపి స్థలం: Japan

జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026 పోటీల కోసం రైఫిల్, పిస్టల్ మరియు షాట్‌గన్ విభాగాలలో పాల్గొనే భారత షూటింగ్ జట్లను ప్రకటించారు. ఈ క్రీడలు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 1 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రుద్రంక్ష్ పాటిల్, మను బాకర్, ఇషా సింగ్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, అనంతజీత్ సింగ్ నరుకా తదితర ప్రముఖ క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో భారత్ తరఫున వివిధ విభాగాలలో బరిలోకి దిగనున్నారు.