అరకు పర్యాటకులకు తీపి కబురు: హాట్ ఎయిర్ బెలూన్ పునఃప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యాటకులను ఆకర్షించేందుకు అధికారులు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చారు. పద్మాపురం గార్డెన్స్లో ఈ సేవలను జిల్లా కలెక్టర్ నిశాంతి స్వయంగా పునఃప్రారంభించారు. శీతాకాలంలో ప్రకృతి అందాలను గాల్లో ఎగురుతూ వీక్షించేందుకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో పాడేరు ఐటీడీఏ భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.