'యూపీఐ ఛార్జీలు ఎత్తివేయాల్సిందే': దేశవ్యాప్తంగా వ్యాపారుల ఆందోళన

రిపోర్టర్: రాము స్థలం: దిల్లీ

యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే నిర్ణయంపై దిల్లీలో వ్యాపారులు, పెట్రోల్ బంక్ నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.2 వేలకుపైగా విలువైన లావాదేవీలపై ఛార్జీలు విధిస్తే డిజిటల్ చెల్లింపులు నిలిపివేస్తామని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) చైర్మన్ బ్రిజేష్ గోయల్, ప్రధాన కార్యదర్శి గుర్మీత్ అరోరా హెచ్చరించారు. ఈ అదనపు భారాన్ని ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని స్పష్టం చేశారు.