మెదక్ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు తడిసిపోయిన ధాన్యం
రిపోర్టర్: రాజేష్
స్థలం: మెదక్
మెదక్ మరియు సిద్దిపేట జిల్లాలలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల టార్పాలిన్లు అందక తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు వాపోయారు. తక్షణమే స్పందించి ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.