నిత్యావసర ధరల పెంపుపై బీఆర్ఎస్ నిరసన: సర్కార్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఎల్బీనగర్

నిత్యావసర సరుకుల ధరల విపరీతమైన పెరుగుదలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎల్బీనగర్ లో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించినట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ నుండి రింగ్ రోడ్డు వరకు నల్లటి దుస్తులతో మహిళలు ప్రదర్శన చేపట్టారని, ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.