తీవ్ర తుఫాను ముప్పు: అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
మురసు తుఫాను ముప్పు పొంచి ఉన్నందున విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. గతంలో సంభవించిన విపత్తుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.