విజయనగరం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ వినతుల వెల్లువ
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వెల్లువ కురిసింది. వైకల్య శాతం తగ్గి పింఛన్లు కోల్పోతున్న బాధితులు, వాహనాలు అందక ఇబ్బంది పడుతున్న దివ్యాంగులు తమ వేదనను అధికారుల ముందు వెళ్లగక్కారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ స్పందన కార్యక్రమంలో మొత్తం 226 అర్జీలు అందగా, అత్యధికంగా రెవెన్యూ శాఖకు 113 వినతులు వచ్చాయి. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జేసీ సేధుమాధవన్ ఆదేశించారు.