పశుగ్రాసం సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.14 వేల ఆర్థిక సాయం

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పశుగ్రాసం సాగు చేసే సన్నకారు రైతులకు ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.14,023 అందించనుందని తలకొండపల్లి పంచాయతీ అధికారి తెలిపారు. ఒకటి నుంచి ఐదు ఎకరాల్లోపు భూమి కలిగి, పశువులు, గొర్రెలు, మేకలు పెంచే రైతులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల రైతులు గ్రామపంచాయతీ కార్యాలయంలో సంప్రదించి అవసరమైన పత్రాలు సమర్పించాలని కోరారు.