కుటుంబంపై అక్రమ ఆరోపణలు ఆపకపోతే లీగల్ చర్యలు తప్పవన్న ఉద్ధవ్ థాకరె

రిపోర్టర్: రాము స్థలం: మహారాష్ట్ర

దిశ సాలియన్ మృతి కేసుకు సంబంధించి తన కుటుంబంపై జరుగుతున్న క్యారెక్టర్ అససినేషన్ ప్రచారం వెంటనే ఆపాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరె హెచ్చరించారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిత్య థాకరెకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.