ప్రకాశం జిల్లాలో జూదంపై పోలీసుల దాడి ఆరుగురి అరెస్ట్

రిపోర్టర్: విజయ్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వలేటివారిపాలెం ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు చుండి గ్రామ శివార్లలో జూదం ఆడుతున్న ప్రాంతంపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు జూదగాళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.