ప్రయాణికులకు తీపి కబురు అందించిన టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక డిజిటల్ విధానం
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త డిజిటలైజేషన్ తో ముందుకు వచ్చినట్లు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఒకే ఒక్క క్యూఆర్ కోడ్ ద్వారా అన్ని సేవలను అరచేతిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా బస్సుల లైవ్ లొకేషన్ ట్రాకింగ్, డిజిటల్ టికెట్ రిజర్వేషన్, రూట్ల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని, క్యూలైన్లలో నిలబడే అవసరం తప్పి ప్రయాణ సమయం ఆదా అవుతోందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.