కన్నుమూసిన ప్రముఖ నటి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Mumbai
బాలీవుడ్ ప్రముఖ నటి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ వయసు 75 సంవత్సరాలు మంగళవారం మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఒక ప్రకటన ద్వారా ధృవీకరించారు. కృష్ణ ముఖర్జీ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. రాణి ముఖర్జీ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గతంలో పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. ఆమె మృతితో ముఖర్జీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.