రీ-ఎంట్రీలో ఘోర వైఫల్యం: భువి కెరీర్ ముగిసినట్లేనా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూజిలాండ్
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో తీవ్రంగా నిరాశపరిచాడని విశ్లేషకులు తెలిపారు. నాలుగు మ్యాచ్ లు ఆడిన ఆయన కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి అత్యంత చెత్త బౌలింగ్ సగటు నమోదు చేశాడని, ఈ ప్రదర్శనతో ఆయన అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనని క్రీడా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.