'ప్లాస్టిక్ కవర్లతోనే ప్రాజెక్ట్ రక్షణ': కొమురంభీం ప్రాజెక్టుపై ఆందోళన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Komaram Bheem Asifabad
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీం (అడ) ప్రాజెక్ట్ ఆనకట్ట దెబ్బతిని మూడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వరదల తాకిడికి కుడివైపున మట్టి కొట్టుకుపోయి కట్ట ప్రమాదకరంగా బీటలు వారినా, అధికారులు ప్లాస్టిక్ కవర్లు కప్పి తాత్కాలికంగా కాలం వెళ్లదీస్తున్నారు. కట్ట బలహీనపడటం మరియు ఎడమ కాలువలో పూడిక పేరుకుపోవడంతో ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్నగర్, సిర్పూర్ మండలాల్లో 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందక కేవలం తాగునీటికే పరిమితమైందని, వెంటనే నిధులు కేటాయించి కట్టను బాగుచేయాలని రైతులు కోరుతున్నారు.