యువతి హత్య కేసులో తీస్ హజారీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

దేశ రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్లో ఇరవై ఒక్క ఏళ్ల కంటెంట్ క్రియేటర్ ముస్కాన్ శర్మను దారుణంగా హత్య చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు తీస్ హజారీ కోర్టులో ముూరు పేజీలకు పైగా చార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు ఇమ్రాన్ గత కొంతకాలంగా వేధిస్తుండటంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడికి సహకరించిన దిగ్విజయ్ను కూడా అరెస్ట్ చేశామని, విచారణను వేగవంతం చేయాలని కోర్టును కోరినట్లు అధికారులు స్పష్టం చేశారు.