వైసీపీ పాలనపై ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజం: దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఫైర్

రిపోర్టర్: నరేష్ స్థలం: గుంటూరు

గత వైకాపా ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమ కేసులు, ప్రతిపక్షాలపై వేధింపులు, ఎన్నికల వ్యవస్థపై దాడుల గురించి ప్రజలందరికీ పూర్తిగా తెలుసని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. పుంగనూరు, పులివెందుల, రాయచోటి ప్రాంతాలలో హింసను ప్రేరేపిస్తూ నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు అవాస్తవ ప్రచారాలకు తెరలేపారని ఆయన మండిపడ్డారు.