బేలాపూర్ ఆర్పీఎఫ్ లాకప్ వెనుక భయానక ఘటన: చీరలతో ఖైదీల పరారీ
రిపోర్టర్: రాము
స్థలం: Navi Mumbai
మహారాష్ట్రలోని నవీ ముంబై బేలాపూర్ ఆర్పీఎఫ్ లాకప్ నుంచి వైరు చోరీ కేసులో అరెస్టయిన ఇద్దరు మహిళా నిందితులు అర్ధరాత్రి చీరల సహాయంతో పరారయ్యారని సెంట్రల్ రైల్వే చీఫ్ స్పోక్స్‌పర్సన్ సునీల్ నీలా తెలిపారు. లాకప్ తాళం తీసి బాల్కనీలోని జనరేటర్‌కు చీరలు కట్టి కిందకు దిగి పారిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఒక నిందితురాలిని తిరిగి అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో నిందితురాలి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు పేర్కొన్నారు.