ఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ రామన్నపేటలో నిరసన

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

రామన్నపేట కోర్టు ఎదుట ఐలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడటంలో కమిషనర్ విఫలమయ్యారని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, సంఘం సభ్యులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.