కరీంనగర్ లో మళ్లీ విజృంభిస్తున్న భూ కబ్జాకోరులు

రిపోర్టర్: సతీష్ స్థలం: కరీంనగర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా కనుమరుగైన భూ కబ్జాకోరులు మళ్లీ విజృంభిస్తూ అమాయకుల స్థలాలను అక్రమంగా ఆక్రమిస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు, బై నంబర్లతో వివాదాలు సృష్టిస్తూ రౌడీమూకలతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ మేటర్ అంటూ కొట్టిపడేస్తుండటంతో, రెవెన్యూ అధికారుల కాలయాపన వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.