విశాఖకు గోదావరి నీళ్లు తీసుకువస్తామన్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 28,445 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, 11 మండలాల్లో 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండేళ్లలో ఉత్తరాంధ్రకు 91 ప్రాజెక్టులు, రూ.5.37 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కరవు పరిస్థితులున్నప్పటికీ పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా అనకాపల్లికి నీటిని తెచ్చామని, త్వరలోనే విశాఖ నగరానికి సైతం గోదావరి జలాలను అందించి తాగునీటి కష్టాలు తీరుస్తామని ధీమా వ్యక్తం చేశారు.