విజయనగరం మేయర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సంతోషి కుమారి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం స్వతంత్ర మేయర్ అభ్యర్థిగా బెల్లన సంతోషి కుమారి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సామాన్య మహిళనైన తాను ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అణచివేయబడిన వారికి అండగా నిలిచి సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొంటూ పట్టణ ప్రజలు అందరూ తమ అమూల్యమైన ఓట్లతో తనను గెలిపించి ఆశీర్వదించాలని ఆమె కోరారు.