కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: విజయ్ స్థలం: కుప్పం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి కోట్లాది రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పంలో ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాల భవన నిర్మాణాలకు భూమిపూజ చేసిన ఆయన, మల్లనూర్ జూనియర్ కళాశాల నూతన భవన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా కొత్తపేటలో నిర్వహించిన బహిరంగ సభలో రైతులు, యువతతో ముఖాముఖి నిర్వహించి ప్రకృతి సేద్యం ప్రాముఖ్యతను వివరించారు.