తుపాను బాధితులకు ఓటీపీ లేకుండానే గ్యాస్ సిలిండర్ల పంపిణీకి కేంద్రం గ్రీన్సిగ్నల్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

అర్నబ్ తుపాను ప్రభావిత పదమూడు జిల్లాలలో ఓటీపీ ధ్రువీకరణ లేకుండా నేరుగా నగదు చెల్లించి గ్యాస్ సిలిండర్లు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. విద్యుత్ మరియు నెట్వర్క్ అంతరాయాల కారణంగా రాష్ట్ర విజ్ఞప్తి మేరకు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలకు నిరంతర పంపిణీ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు గ్యాస్ అందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది.