విద్యార్థిని విచక్షణా రహితంగా కొట్టిన ఉపాధ్యాయుడు: సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు

రిపోర్టర్: గోపి స్థలం: గజపతినగరం

మరుపల్లి ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి నగర దిలీప్ను తెలుగు ఉపాధ్యాయుడు డి.రామకృష్ణ కర్రతో విచక్షణా రహితంగా కొట్టడంతో కుడిచేతిపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు వెంటనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ పాఠశాల ప్రిన్సిపల్కు ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు.