యూపీ ఎన్నికల వేళ కాంగ్రెస్కు ఎస్పీ భారీ షాక్: సీట్ల సర్దుబాటుపై ఉద్రిక్తత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కనీసం నూట యాభై స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుండగా, సమాజ్వాదీ పార్టీ మాత్రం కేవలం యాభై మూడు నుంచి యాభై ఐదు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమంటోందని ఎస్పీ వర్గాలు తెలిపాయి. గత లోక్సభ ఎన్నికల ఓట్ల సరళిని ప్రాతిపదికగా తీసుకుని ఎస్పీ ఈ ఫార్ములాను రూపొందించిందని, తాము మాత్రం మూడు వందల యాభై స్థానాల్లో బరిలోకి దిగుతామని ఆ పార్టీ స్పష్టం చేస్తోందని నేతలు పేర్కొన్నారు.