ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న కిల్లర్ సినిమా: భారీ ధర పలికిన వైనం
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
థియేటర్లలో రెండు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన కిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్ లో నటించారు. త్వరలోనే ఈ సస్పెన్స్ చిత్రం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి రానుందని చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు.