హక్కుల సాధన కోసం బెల్లంపల్లిలో నల్లగంతలతో కదంతొక్కిన సింగరేణి రిటైర్డ్ కార్మికులు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐబీ చౌరస్తాలో తెలంగాణ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కంపెనీ లాభాల్లో వాటాతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని మరియు ఇళ్లు కేటాయించాలని సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్రాంత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆవేదనను వెళ్లగక్కారు.