జాతీయ సైన్స్ సెమినార్లో ప్రథమ స్థానం సాధించిన ఖమ్మం విద్యార్థిని
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం: జాతీయ సైన్స్ సెమినార్–2026లో భాగంగా “Indian Energy Basket 2047: Prospects & Challenges” అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ సెమినార్లో త్రివేణి పాఠశాల ఖమ్మం శాఖకు చెందిన కె. వనిషా రెడ్డి ప్రథమ స్థానం సాధించారు. దీంతో రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం, ఇంచార్జ్ డీఎస్ఓ వెంకటేశ్వర్లు విద్యార్థినిని అభినందించారు.